హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద జర్నలిస్ట్ ఫోరం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమరుల త్యాగాలను కొనియాడారు.
కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్, ఉపాధ్యక్షుడు రమేశ్ హజారే, కోశాధికారి యోగానంద్, టెంజు అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణకుమార్, ఐజేయూ నాయకుడు అవ్వారి భాసర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాయక్ పాషా, కిషన్ గుప్తా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేఖర్, మేడ్చల్ జిల్లా ఇన్చార్జ్ అమర్, శివాజీ, విఠల్‌రెడ్డి, రాజారెడ్డి, రమేశ్, సుధీర్ మంకాలతోపాటు పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు.