హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరికి బదులుగా పట్టు పరిశ్రమను విస్తరించాలని, 2022-23 సంవత్సరానికి గాను నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా 7 వేల ఎకరాల్లో పట్టు సాగు చేపట్టేందుకు కృషి చేయాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి సూచించారు. పట్టు పరిశ్రమ శాఖ సిబ్బందితో బుధవారం సమీక్ష నిర్వహించిన ఆయన, సమగ్ర సెంట్రల్ సిల్ బోర్డు పథకం-2 కింద అందిస్తున్న సబ్సిడీలను రైతులకు, వ్యాపారుల అభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు. తకువ పెట్టుబడితో ఎకువ లాభాన్ని అందించే పట్టు పరిశ్రమ రైతు అభ్యుదయానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. రాష్ట్రంలోని నేలలు, వాతావరణం పట్టు పరిశ్రమకు ఎంతో అనుకూలమని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పట్టు రైతులు మంచి లాభాలు పొందుతున్నారని, ఇతర జిల్లాల రైతులు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కొత్తగా ఎంపికైన రైతులకు గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వివిధ జిల్లాల డీడీఎస్, ఏడీఎస్, ఎస్వోఎస్ సిబ్బంది పాల్గొన్నారు.