హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : స్త్రీనిధి సంస్థ, సంస్థ ఎండీ పై నలుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం వేసిన విచారణ కమిటీని స్వాగతిస్తున్నట్టు స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఇందిర, రాఘవదేవి, కోశాధికారి సరస్వతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంస్థపై అనవసరమైన అపోహలు కలిగించి సంస్థ పనితీరు, అభివృద్ధిపై ప్రభావం చూపేలా, సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగేలాకొందరు వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కమిటీ ద్వారా వాస్తవాలు తెలుస్తాయని, అపోహాలు తొలిగిపోతాయని తెలిపారు. విచారణ కమిటీ ఏర్పాటుపై హర్షంవ్యక్తం చేశారు.