హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్ర ప్రజలు మెజార్టీ సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కా ర్యాలయంలో మీడియాతో మాట్లాడు తూ.. ఎనిమిది సీట్లలో గెలిపించి మోదీ ని, బీజేపీని ఆశీర్వదించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల గొంతుకై, వారి సమస్యలపై పోరాడుతామని చెప్పారు. రాజ్యాంగాన్ని మా రుస్తారని, రిజర్వేషన్లు తీసేస్తారని కాం గ్రెస్ చేసిన విష ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మలేదని చెప్పారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజలు నిరాశ నిసృ్పహాలతో ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు బీజేపీ ఒక ఆశా కిరణంలా కనిపించిందని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా అంకితభావంతో, నమ్మకంతో పనిచేస్తామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను రెఫరెండంగా భావించారని, ఆ పార్టీకి సగం సీట్లు కూడా రాలేదని, దీనిని ఏ విధంగా సమర్థించుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ నా యకత్వంలో ఏపీలో బీజేపీ మంచి మె జార్టీ సాధించిందని, ఇందుకు ఏపీ ప్రజలకు కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.