హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): వివిధ గ్రేడ్లకు చెందిన 223 మంది పంచాయతీ కార్యదర్శులను అంతర్ జిల్లా డిప్యూటేషన్‌పై బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు.
ఈ బదిలీలు ప్రాథమికంగా రెండేండ్ల కాలపరిమితికి వర్తిస్తాయి. ఖాళీల లభ్యతను బట్టి మరో ఏడాది వరకు పొడిగించే అవకాశం ఉంటుంది.