హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): డీజీపీ నియామక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. తన సిఫార్సుల తర్వాత యూపీఎస్సీ గతనెల 12న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పంపిందని, ఆ జాబితా పరిశీలనలో ఉన్నదని తెలియజేసింది. రాష్ట్ర తాత్కాలిక డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమించడాన్ని సవాల్ చేస్తూ టీ ధన్‌గోపాల్‌రావు దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టడంతో..
యూపీఎస్సీ నుంచి వచ్చిన మూడు పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. ఆ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.