హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ) : భారత్ సమ్మిట్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా ప్రచురించడంపై సర్వే ఆఫ్ ఇండియా చర్యలకు ఉపక్రమించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెసిడెంట్ గ్రీవియన్స్ అధికారి వినయ్ ప్రకాశ్‌ను ఆదేశించింది. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రపటంపై విచారణ జరిపించామని, చిత్రపటంలో తప్పులున్నట్టు నిర్ధారించినట్టు పేర్కొన్నది.
రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ఏప్రిల్ 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్‌లో ప్రదర్శించిన దేశ చిత్రపటంలో ఈ మూడు కీలక తప్పులు దొర్లాయి. దీనిపై న్యాయవాది కారుపోతుల కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హోంశాఖ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సర్వే ఆఫ్ ఇండియాకు ఆదేశించింది.