Crop Loan Waiver | హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రెండోరోజైన శుక్రవారం 31,339 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. రూ.41 వేల నుంచి రూ.43 వేల మధ్య రుణాలు కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.126.50 కోట్ల రుణాలను మాఫీ చేసింది. తొలిరోజు రూ.41 వేల వరకు గల 62,758 మంది రైతులకు రూ.237.85 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 94,097 మంది రైతులకు చెందిన రూ.364.34 కోట్లకు రుణ విముక్తి కలిగింది.