New Ministers | హైదరాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ) : నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం శాఖలు కేటాయించింది. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఇప్పటికే ఉన్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్, ఉపాధి శిక్షణ శా ఖలు కేటాయించగా, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, మత్స్యశాఖ, క్రీడలు, సాంస్కృతిక శాఖ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ కేటాయించారు.
బుధవారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు భేటీ అనంతరం కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, జీ వెంకటస్వామి (కాకా) 1973 నుంచి 1977 వరకు కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం కాకా పెద్ద కుమారుడు జీ వినోద్ 2004 నుంచి 2009 వరకు రాష్ట్ర కా ర్మిక మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు వివేక్‌కు కార్మికశాఖను అప్పగించడం గమనార్హం.