Telangana voters | రాష్ట్రంలో ఓటర్లు 3.06 కోట్లు.. ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసిన ఎన్నిక కమిషన్
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం తెలంగాణ ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఓటర్ల పరిశీలన కోసం ఉంచిన ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3.06 కోట్ల మంది ఉన్నారు.
- 19 వరకు అభ్యంతరాలు.. అక్టోబర్ 4న తుది జాబితా
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం తెలంగాణ ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఓటర్ల పరిశీలన కోసం ఉంచిన ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3.06 కోట్ల మంది ఉన్నారు. వీరిలో పురుషులు సుమారు 1.53 కోట్లు కాగా, మహిళలు 1.52 కోట్ల మంది ఉన్నారు. ఓటర్లలో కొత్తగా నమోదైన 18 నుంచి 19 ఏండ్ల మధ్య వయస్కులు 4.76 లక్షలు ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 2,133 మంది, ఎన్ఆర్ఐలు 2,742, సర్వీసు ఓటర్లు 15,337 మంది ఉన్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, సవరణలను సెప్టెంబర్ 19వరకు స్వీకరించనున్నారు. తుది జాబితాను అక్టోబర్ 4న ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.
హైదరాబాద్‌లో మహిళా ఓటర్లే అధికం
రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం హైదరాబాద్ జిల్లాలో 43 లక్షల 989 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 22,09,972 మంది కాగా, మహిళలు 20,90,727 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 290 మంది ఉన్నారు. జిల్లాలో అత్యధిక ఓటర్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,56,995 మంది ఉండగా, అత్యల్పంగా చార్మినార్ సెగ్మెంట్లో 2,16,643 మంది ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

