హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర క్యాబినెట్ భేటీ 21న నిర్వహించనున్నట్టు సమాచారం. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అన్ని శాఖల నుంచి వివరాలు సేకరించి, క్యాబినెట్ భేటీ లో చర్చించాలని నిర్ణయించినట్టు సమాచారం. దీని ఆధారంగా నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం.