మహబూబాబాద్ : పండుగుపూట(Rakhi festival) మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్న ఓ యువతి తన సోదరులకు దవాఖానలోనే రాఖీ కట్టి కన్నుమూసింది(Sister died). వివరాల్లోకి వెళ్తే.. నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న ఓ యువతి(17) ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసింది.
గమనించిన కుటుంబ సభ్యలు చికిత్స కోసం హాస్పిటల్లో చేర్పించారు. కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనని భావించి శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల వ్యవధిలో తుదిశ్వాస విడిచింది. కండ్ల ముందే తమ కూతరు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట సోదరులకు రాఖీ కట్టి తుదిశ్వాస విడిచిన చెల్లి
కోదాడలో డిప్లొమా చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో ఆకతాయుల వేధింపులు తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది.
ఆసుపత్రిలో కొన ఊపిరితో ఉన్న తను రాఖీ పండగ నాటికి ప్రాణాలతో ఉంటానో లేదో అన్న బాధతో… https://t.co/rO3YBqqo8O pic.twitter.com/k5LMWuJHi4
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2024