హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తేతెలంగాణ): కారుణ్య ఉద్యోగాల్లో పట్టభద్రులైన వారికి క్లరికల్ గ్రేడ్-3 పోస్టులు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. హైదరాబాద్ విద్యానగర్‌లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో గుర్తింపు సంఘం, సింగరేణి కాలరీస్‌కు గురువారం ఒప్పందం కుదిరింది.
తాజాగా జారీచేసిన సర్క్యూలర్ ప్రకారం మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా( మైనింగ్/మెకానికల్/ ఎలక్ట్రికల్, ఐటీఐ ఎలక్ట్రికల్, ఫిట్టర్, వెల్డర్ పూర్తి చేసిన వారికి విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలివ్వాలని నిర్ణయించారు.