హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శిలువ గుర్తు కలకలం రేపుతున్నది. టీ కప్పులపై ‘టీ’ అనే ఆంగ్ల అక్షరాన్ని శిలువ గుర్తులా ముద్రించిన వైనం వెలుగులోకి వచ్చింది.
భక్తుల నుంచి సమాచారం అందుకున్న టీటీడీ ఆరోగ్యశాఖ అధికారులు టీ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. టెలిఫోన్ ఆఫీస్ సమీపంలోని ఒక షాపును సీజ్ చేశారు. ఆ షాపులో నుంచి టీ కప్పులు స్వాధీనం చేసుకున్నారు.