హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో షీటీమ్స్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సురేశ్ అదృశ్యమయ్యాడు. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్యనాయక్ జాదవ్ గన్‌మెన్ సురేశ్‌ను దుర్భాషలాడటం ఇందుకు కారణమని తెలుస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ వ్యక్తిగత వివరాలు కావాలని ఆ గన్‌మెన్ అడగడం తో అనధికారికంగా ఆ వివరాలు ఇవ్వలేనని సురేశ్ సమాధానమిచ్చాడు. దీం తో ఆగ్రహానికి గురైన ఆ గన్‌మెన్ అందరిముందే ఆ హెడ్‌కానిస్టేబుల్‌ను బూ తులు తిట్టాడు. దీనిపై డీసీపీకి, ఏసీపీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన సురేశ్ శనివారం సాయంత్రం తన ఉద్యోగానికి రాజీనామా చేసి, పత్తా లేకుండాపోయారు.
సురేశ్.. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య అధికారులు, పోలీసులకు ఫోన్‌చేసి ఆ రా తీశారు. దీంతో అసలు వ్యవహారం బయటకొచ్చింది. కార్యాలయం వెలుపల ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా.. రెండు చోట్ల ట్యాంక్‌బండ్ రెయిలింగ్ ఎక్కిన సురేశ్.. జనం సం దడి ఉండటంతో దిగిపోయినట్టు రికార్డయింది. సురేశ్ భార్య ఫిర్యా దు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు సైఫాబాద్ ఇన్స్పెక్టర్ సీతయ్య తెలిపారు.