మద్దూరు, జూలై 30 : అది ఒక ప్రభుత్వ కార్యాలయం.. కానీ ఆచరణలో మాత్రం కాంగ్రెస్ నాయకుల కార్యాలయంగా మా రింది. ఫలితంగా పీఏసీసీఎస్ కార్యాలయం కాస్తా పీసీసీ కార్యాలయంగా మారిందనే వి మర్శలు తలెత్తుతున్నాయి. ఇది ఎకడో కా దు.. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండల కేంద్రం కా వడం విశేషం. మద్దూరు మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన పీఏసీసీఎస్ కార్యాలయ భవనాన్ని జూన్ 16వ తేదీన ప్రారంభించా రు. ప్రారంభం రోజునే కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ జెండాలను ఏర్పాటు చేసి అ చ్చం కాంగ్రెస్ కార్యాలయం భవన ప్రారంభోత్సవం మాదిరే మార్చేశారు.
అంతటితో ఆగకుండా ఈ నెల 21వ తేదీన ఇదే కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం సైతం ఏర్పాటు చేశారు. మరోమారు ఈ నెల 28వ తేదీన ఇదే కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్ కార్యక్రమం కోసం నియమించబడిన బీఎల్ఏల ను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. అయితే రైతులకు ఉపయోగపడాల్సిన కార్యాలయం కాస్తా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారడం ఆది కూడా సీఎం ఇలాకాలో చో టు చేసుకోవడం విమర్శలకు దారితీస్తుంది.
మద్దూరు పట్టణంలోని పీఏసీసీఎస్ కార్యాలయం ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం వినియోగిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు, పట్టణ కౌన్సిలర్లు తాసీల్దార్ మహేశ్‌గౌడ్, కలెక్టరేట్ ఏవో అనిల్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సహకార సంఘం కార్యాలయం జూన్ 16న కాంగ్రెస్ పార్టీ జెండాలను కట్టి ప్రారంభించారు. అదే రోజు తాసీల్దార్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మరోసారి ఈ నెల 21న కాంగ్రెస్ నాయకులు పత్రికా సమావేశం, 28న కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి చెందిన బీఎల్ఏలను పిలిచి సన్మానించారని ఫి ర్యాదులో పేర్కొన్నా.. అ ధికారంలో చలనం లే కుండా పోయిందని ఆరోపించారు. ఫిర్యాదు చేసి న వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వం చర్ల గోపాల్, కౌన్సిలర్లు నర్సింహ, గోపాల్, మౌ లానా, దినేశ్‌కుమార్, అంజయ్య ఉన్నారు.