మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 19:42:43

వైద్యాధికారుల సేవలు అనిర్వచనీయం : మంత్రి కొప్పుల

 వైద్యాధికారుల సేవలు అనిర్వచనీయం :  మంత్రి కొప్పుల

హైదరాబాద్ :  కరోనాపై పోరులో వైద్యాధికారుల సేవలు అనిర్వచనీయమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డాక్టర్లు, నర్సులు సేవాతత్పరతతో వైద్యసేవలు అందించి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఆదివారం నగరంలో ఐఎస్ఎం ఎడ్యుటెక్‌ సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న కొవిడ్ -19 మహమ్మారిని తరిమికొట్టడంలో వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సంస్థ ద్వారా విదేశాలలో ఎంబీబీఎస్ అభ్యసించిన యువ డాక్టర్లు తమ స్వస్థలాలకు తిరిగి వచ్చి అంకితభావంతో రోగులకు సేవలందించడాన్ని మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లను మంత్రి సత్కరించి అభినందనలు తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.