హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయేంద్ర బోయి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
కార్యక్రమ రూట్‌మ్యాప్, సాంస్కృతిక ప్రదర్శనలు, పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 22న సీఎం చేతులమీదుగా అమరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించనున్నారు.