హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడుల్లోని టీచర్లను ఐదు రోజులపాటు పాఠశాల విద్యాశాఖ శిక్షణ ఇవ్వనున్నది.
రాష్ట్ర స్థాయి రిసోర్స్పర్సన్లకు మే 5 నుంచి 9, మండల రిసోర్స్పర్సన్లకు మే 13 నుంచి 17 వరకు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు మే 20 నుంచి 24 వరకు శిక్షణ ఇస్తారు.