సూర్యాపేట : దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన మహావీరచక్ర దివంగత కల్నల్ సంతోష్ బాబు రెండో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి ఘనంగా నివాలులర్పించారు.
కాసరబాద్ రోడ్డులోని స్మృతి వనంలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సంతోష్ బాబు విగ్రహాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సంతోష్ బాబు మరణానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయ సందేశం ఇతర రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశానికి స్ఫూర్తివంతమైన సందేశాన్ని చేరవేసిందన్నారు.
ఆర్మీలో పనిచేసే ప్రతి ఒక్కరికి రేపటి రోజున వారి కుటుంబాలకు భారత ప్రజలు అండగా ఉంటారు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సందేశం అని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సంతోష్ కుమర్ భార్య సంతోషి, కుటుంబసభ్యులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత, జడ్పీటీసీ జీడి భిక్షం, టీఅర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వీ, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ, తదితరులు పాల్గొన్నారు.