రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 6 (నమస్తేతెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతోనే వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొన్నదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ వీరయ్య విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కోపంతో నేతన్నలపై కక్షసాధింపు మానుకొని ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
శనివారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో వస్త్ర పరిశ్ర యజమానులు, కార్మికులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నేతన్న గర్జన సభకు ఆయన హాజరయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్స్టైల్స్ రంగం పూర్తిగా నిర్వీర్యమైందని వీరయ్య విమర్శించారు.