ముస్లింలకు రేవంత్ దొంగ హామీలు
ముస్లిం నాయకులకు ఎమ్మెల్సీ ఇస్తానంటూ రేవంత్‌రెడ్డి ప్రలోభ పెడుతున్నాడని, ఆ మాటలు నమ్మొద్దని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా.. అక్కడి ముస్లిం నేతలకు ఎమ్మెల్సీలు ఇస్తానని దొంగ హామీలు ఇస్తున్నారని విమర్శించారు.
- ఆ మాటలు నమ్మి మోసపోవద్దు
- మహమూద్ ఆలం పెద్ద కబ్జాకోరు, నంబర్‌వన్ లోఫర్
- సీఎం కేసీఆర్ పాలనలోనే ముస్లింలకు పెద్దపీట
- హోం మంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ముస్లిం నాయకులకు ఎమ్మెల్సీ ఇస్తానంటూ రేవంత్‌రెడ్డి ప్రలోభ పెడుతున్నాడని, ఆ మాటలు నమ్మొద్దని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా.. అక్కడి ముస్లిం నేతలకు ఎమ్మెల్సీలు ఇస్తానని దొంగ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. రేవంత్ మోసపూరిత మాటలు నమ్మిన మహబూబ్ ఆలం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పంచన చేరారని చెప్పారు.
తెలంగాణ భవన్లో హోం మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న మహబూబ్ ఆలం ఇప్పుడు దేవుడిలాంటి కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం బాధాకరం అని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలోనే వక్ఫ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపిస్తున్న మహబూబ్ అలం పెద్ద కబ్జాకోరు, నంబవర్వన్ లోఫర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మలక్‌పేట, మల్లేపల్లి, చంచల్‌గూడ వంటి ఐదు ప్రాంతాల్లో వక్ఫ్ భూములు కబ్జా చేసి, కాలేజీలు కట్టాడని ఆరోపించారు.
కేసీఆర్ పాలనలోనే ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత వక్ఫ్ భూములను కాపాడేందుకు కేసీఆర్ 22/ఏ జీవోను తీసుకొచ్చి, భూముల పరిరక్షణకు అండగా నిలిచారని చెప్పారు. ధరణి నుంచి కూడా వక్ఫ్ భూములకు రక్షణ దొరికిందని అన్నారు. మోసకారి అయిన రేవంత్‌రెడ్డి మాటలు విని.. బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం వారి సిగ్గుమాలిన తనానికి నిదర్శనం అని మండిపడ్డారు.
రేవంత్ గెలిచింది లేదు.. సచ్చింది లేదు.. అతను ఇస్తానన్న ఎమ్మెల్సీలకు ఆశపడి బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ సంఘ్ పరివార్ చేతుల్లోకి వెళ్లిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మైనార్టీ ఇంచార్జ్ ఖాజా బద్రూద్దీన్, తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ సోమా భరత్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
Horoscope | 12-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

