హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను డిప్యూటీ సర్వేయర్లుగా నియమించడానికి రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్నవారిని సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి తీసుకురావడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సర్వీసు నిబంధనలకు సంబంధించి స్పష్టత ఇవ్వాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను సర్వే విభాగం కమిషనర్ ఇటీవల కోరారు. దీంతో ఈ అంశంపై అధ్యయనం చేసి వివరాలు అందజేయాలంటూ నవీన్ మిట్టల్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.