హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : టీ హబ్ వ్యవహారంలో రేవంత్ సర్కార్ దిద్దుబాటు చర్యలు చే పట్టింది. టీ హబ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న ప్రతిపాదనను విరమించుకున్నది. ఇదే అంశంపై శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘కేసీఆర్ స్టార్టప్.. సర్కార్ ప్యాకప్’ శీర్షికన సంచలన కథనం ప్రచురించింది. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందిం చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్ చేసి మాట్లాడారు.
టీ హబ్‌ను స్టార్టప్ కేం ద్రంగా కొనసాగించాలని ఆ దేశించారు. ఇంక్యుబేటర్ గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా, స్టార్టప్‌లకు కేంద్రం టీ హబ్‌లో ఇతర కార్యాలయాలు ఉండకూడదని, అలాంటి ఆలోచన ను విరమించుకోవాలని తెలిపారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని సూచించారు.