హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్య కమిషరేట్కు అనుబంధంగా ఉన్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ నిర్వహించే షార్ట్ టర్మ్ వొకేషనల్ కోర్సుల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
మాడ్యూల్-1లో 75.79%, మాడ్యూల్ -2లో 79.24%, మాడ్యూల్-3లో 75.13% చొప్పున మొత్తంగా 76.72% విద్యార్థు లు పాస్ అయినట్టు ఇంటర్ విద్య ఆర్జేడీ ఒబిలిరాణి తెలిపారు. మొత్తంగా 1,485 మందికి విద్యార్థులకు 1,136 విద్యార్థులు పాస్ అయ్యారని ప్రకటించారు.