హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రంలోని ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులు ప్రజలను కోరారు. రాష్ట్రంలో సుమారు 40.97లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం 52.04లక్షల బీవోపీవీ టీకా డోసులను జిల్లాలకు సరఫరా చేసినట్టు వెల్లడించారు.
జూన్ 29, 30న ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. జూలై 1న కూడా అదనంగా మరో రోజు కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.