జన్నారం, జూన్ 18 : మంచిర్యాల జిల్లా జన్నారంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు నిరసన సెగ తగిలింది. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి వచ్చిన ఆయన ముందు.. జన్నారం ఫారెస్టులో వాహనాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేయాలని సామాజిక కార్యకర్త శ్రీరాముల భూమాచారి నిరసన తెలిపారు.
తన ఒంటిపై డిమాండ్లతో కూడిన ఫ్లెక్సీని తొడుక్కొని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సమస్యలను సంబంధిత మంత్రికి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.