పదోన్నతులకు డిప్యుటేషన్ తప్పనిసరి.. తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు
తెలంగాణ పోలీస్‌శాఖలో ఎస్సైలు, ఇన్స్పెక్టర్ల పదోన్నతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. డిప్యుటేషన్ కాలం పూర్తిచేయని అధికారులకు ఇకపై ప్రమోషన్లు ఇవ్వబోమని డీజీపీ కార్యాలయం స్పష్టంచేసింది.
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్‌శాఖలో ఎస్సైలు, ఇన్స్పెక్టర్ల పదోన్నతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. డిప్యుటేషన్ కాలం పూర్తిచేయని అధికారులకు ఇకపై ప్రమోషన్లు ఇవ్వబోమని డీజీపీ కార్యాలయం స్పష్టంచేసింది. ఈ మేర కు గురువారం ఉన్నతాధికారులు సర్యులర్ జారీచేశారు.
పోలీస్ శాఖలో సివిల్ ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు ప్రత్యేక విభాగాల్లో కనీసం రెండేండ్లపాటు డిప్యుటేషన్‌పై విధులు నిర్వహించాలి. ఈ నిబంధనను పాటించని వారి పదోన్నతి కేసులను పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొన్నారు. ప్రస్తు తం పదోన్నతుల జోన్లోకి వచ్చే అధికారుల వివరాలను సేకరించాలని మల్టీజోన్, జోనల్ అధికారులకు సూచించారు.
2026-27, 2027-28 ప్యానెల్ సంవత్సరాల్లో ఖాళీలు ఎన్ని ఉంటాయో అంచనా వేసి, సీనియారిటీ, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అధికారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇకపై పదోన్నతి పొందిన అధికారులను లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ స్టేషన్లలో కాకుండా ప్రత్యేక విభాగాల్లో నే డిప్యుటేషన్‌పై నియమించనున్నట్టు స్పష్టంచేశారు.
శాఖలోని ప్రత్యేక యూనిట్లు, శాఖ వెలుపల ఉన్న విభాగాల్లోనూ ఈ డిప్యుటేషన్ అమ లు చేయనున్నారు. ఇప్పటికే ప్రత్యేక విభాగాల్లో పనిచేసి నిర్దిష్ట కాలాన్ని పూర్తిచేసిన అధికారుల ను తిరిగి పిలిపించి, వారి స్థానాల్లో ఇతర అర్హులైన అధికారులను రొటేషన్ పద్ధతిలో పంపాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

