హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. 2023-24 విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా ఇ ప్పటి వరకు 70,315 మంది విద్యార్థులు మా త్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గతేడాది తొలి విడతలోనే 1.44 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 50 శాతం దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల పదో తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 10వ తేదీతో రిజిస్ట్రేషన్ల గడువు, 11తో వెబ్ ఆప్షన్ల గడువు ముగియనున్నది. 16న తొలి విడత సీట్లు కేటాయిస్తారు.
సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులు
డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తూ ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా 103 కాలేజీల్లో సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 41 కళాశాలలకు అనుమతులు లభించాయి. వెబ్ ఆప్షన్లు పూర్తయ్యే సమయానికి మిగతా కాలేజీలకు కూడా అనుమతులు లభిస్తాయని అధికారులు తెలిపారు. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులు మూడు రోజులు కాలేజీకి వెళ్లి, మిగతా మూడు రోజులు ఇంటర్న్‌షిప్ చేసే పరిశ్రమలో పనిచేయాల్సి ఉంటుంది. నెలకు రూ.10 వేల వరకు ైస్టెఫండ్ ఇస్తారు.

P