హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అఖిల భారత వికలాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
దివ్యాంగుల పెన్షన్ పెంపు, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, ప్రతి దివ్యాంగుడికి డబుల్ బెడ్ రూమ్‌ల కేటాయింపు, స్వయం ఉపాధికి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా ఆసరా పెన్షన్ మొత్తాన్ని పెంచలేదని, ఎంతోమంది దివ్యాంగులు, వృద్ధులు తదితరులు ఆసరా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు.