KTR | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యలను తక్షణమే పరిషరించాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్‌గ్రేడ్ వేతనాలతోపాటు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ టీచర్లు ఎదురొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఆదివారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ను తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మీ నేతృత్వంలో ప్రతినిధులు రేణుక, మల్లిక, శివమ్మ, లక్ష్మి, సుజాత, రోజా తదితరులు సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
సంఘం ప్రతినిధులు వివరించిన ప్రకారం.. మారుమూల పల్లెలు, గిరిజన తండాల్లో చిన్నారులకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఒకరే టీచర్‌గా ఉండి ఆహార పంపిణీ, పిల్లల సంరక్షణ, విద్యా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, బీఎల్వో డ్యూటీలు, సర్వేలు, పల్స్పోలియోవంటి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హెల్పర్ పోస్టులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనవరి నెల నుంచి ప్రధాన అంగన్వాడీ టీచర్లతో సమానంగా రూ.13,650 వేతనాలు చెల్లించడం ప్రారంభించారు. కానీ, మార్చి నుంచి మళ్లీ పాత వేతనం రూ.7,800 మాత్రమే అందించడంతో అసమతుల్యత నెలకొన్నది. దీనివల్ల మినీ అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మినీ అంగన్వాడీ కేంద్రాల భవన కిరాయిలు, కూరగాయల బిల్లులు, ఇతర ఖర్చులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆర్థిక సమస్యలు టీచర్ల జీవనంపై ప్రభావం చూపుతున్నాయి.
ఆ సంఘం ప్రతినిధుల సమస్యలు విన్న కేటీఆర్.. అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలను ప్రస్తావించి తగిన చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కూడా హాజరై సమస్యలపై చర్చించారు. మినీ అంగన్వాడీల అప్‌గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు వేతనాలు సమానంగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్త్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 28న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయంలో ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయని టీటీడీ ఈవో జే శ్యామలరావు, జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. 26న అమ్మవారి ఆలయంలో కోయిల్ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. అర్చకులు అమ్మవారిని సుప్రభాతంతో మేలొలిపి సహస్రనామార్చన, తిరుమంజనం నిర్వహిస్తారు. 27న ఆలయంలో లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 6 వరకు జరగనున్నాయి.