శనివారం 23 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 02:19:00

ఆయిల్‌పామ్‌ టన్ను ధర 14,416

ఆయిల్‌పామ్‌  టన్ను ధర 14,416

  • గెలలకు రికార్డు ధర 

అశ్వారావుపేట, జనవరి 4 (నమస్తే తెలంగాణ): పామాయిల్‌ రైతులకు ఆయిల్‌ ఫెడ్‌ కొత్త సంవత్సరంలో తీపి కబురు అందించింది. ఆయిల్‌ ఫెడ్‌ చరిత్రలోనే టన్ను గెలల ధరను సోమవారం రూ.14,416గా ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌లో టన్ను ఆయిల్‌పామ్‌ గెలల ధర రూ.12,800 ఉండగా ఈ నెలలో ఏకంగా రూ.1,616 పెంచి రూ.14,416గా నిర్ణయించింది. ధర భారీగా పెరగటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి నెలలో తరలించిన గెలలకు ఈ ధర వర్తిస్తుందని ఆయిల్‌ ఫెడ్‌ ప్రకటించింది. logo