పెండింగ్ చలాన్ల ఆదాయం 135 కోట్లు
రాష్ట్రంలో పెండిం గ్ చలాన్లపై ప్రభుత్వం ఇచ్చిన రాయితీ ఈ నెల 31తో ముగుస్తుందని, మరోసారి తేదీ పొడిగించే అవకాశం లేదని పోలీసుశాఖ స్పష్టంచేసింది.
- రాయితీ గడువు మళ్లీ పెంచబోం
- ఈ నెల 31 ఆఖరి తేదీ: పోలీసుశాఖ
హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెండిం గ్ చలాన్లపై ప్రభుత్వం ఇచ్చిన రాయితీ ఈ నెల 31తో ముగుస్తుందని, మరోసారి తేదీ పొడిగించే అవకాశం లేదని పోలీసుశాఖ స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లకుగాను ఇప్పటివరకు 1,52,47,864 (42.38 శాతం) చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది. వీటిల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.34 కోట్లు, సైబరాబాద్ పరిధిలో రూ.25 కోట్లు, రాచకొండ పరిధిలో రూ.16 కోట్లు ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 27 నుంచి పెండింగ్ చలాన్లు రాయితీతో చెల్లించేందుకు ప్రభుత్వం తొ లుత 15 రోజులు అవకాశం కల్పించింది. సాంకేతిక సమస్యల కారణంగా మరోసారి జనవరి 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
ఏపీలో 31 నుంచి బీఈడీ కౌన్సెలింగ్
హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో బీఈడీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు బీఈడీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. నిరుడు జూలై 14న ఎడ్సెట్ ఫలితాలు విడుదలవగా, నెలలు గడిచినా కౌన్సెలింగ్ మాత్రం నిర్వహించలేదు. దీంతో బీఈడీ కళాశాలల యాజమాన్యాలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలో విచారించిన హైకోర్టు వెంటనే బీఈడీ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్రంలో 411 బీఈడీ కాలేజీలు ఉండగా, 34 వేలకు పైగా సీట్లు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

