Gurukula Bata | దుమ్ముగూడెం/కోటపల్లి/బెల్లంపల్లి/మందమర్రి/ఆసిఫాబాద్/మహదేవపూర్/జనగామ రూరల్, డిసెంబర్ 1: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆదివారం నిర్వ హించిన గురుకులాల బాట కార్యక్రమాలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలోని వసతి గృహాలను ఎమ్మెల్సీ తాతా మదు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, రాకేశ్‌రెడ్డి పరిశీలించారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పరిశీలించేందుకు వెళ్లగా, అధికారులు అనుమతి ఇవ్వలేదు. జనగామ మండలం పెంబర్తిలోని జ్యోతిబాఫూలే బాలికల పాఠశాల, కళాశాల హాస్టల్‌ను బీఆర్ఎస్వీ నాయకులు సందర్శించగా గేటు ముందే ఆపి విద్యార్థులతో మాట్లాడించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లోని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
బెల్లంపల్లి : కాసిపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్ద బీఆర్ఎస్వీ నాయకులను అడ్డుకుంటున్న తాళ్ల గురిజాల ఎస్ఐ రమేశ్
మంచిర్యాల జిల్లాలోని కోటపలి ఆశ్రమ పాఠశాల పరిశీలనకు బీఆర్ఎస్వీ నాయకులు వెళ్లగా ద్వారం తెరవకపో వడంతో వెనుతిరిగారు. అక్కడి నుంచి కోటపల్లి ఎస్సీ హాస్టల్‌కు వెళ్తుండగా ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు.
బెల్లంపల్లి మండలం కాసిపేట ఎస్సీ గురుకుల పాఠశాల పరిశీలనకు బీఆర్ఎస్వీ నాయకులు వెళ్లగా గేట్ వద్దే ప్రిన్సిపాల్ అడ్డుకోగా గేట్ ముందు నిరసన తెలిపారు. రామకృష్ణాపూర్ పాఠశాలను బీఆర్ఎస్ నాయకులు సందర్శించి ఆహార పదా ర్థాలను పరిశీలించారు.