బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి నీడను, చల్లదనాన్ని, ఫలాలనందిస్తున్నాయి. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పచ్చదనం పెంచాలని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా సాగుతున్నది.
ఎక్కడికక్కడ చెట్లను నరుకుతూ మళ్లీ మొక్కలు నాటేందుకు సిద్ధమవుతుండడంపై జనం మండిపడుతున్నది. గతంలో నాటిన మొక్కలను కూడా సంరక్షిస్తే బాగుంటుందని కోరుతున్నది.