అశ్వాపురం, జూన్ 13 : ఖమ్మం నగరంలో ఇటీవల ఓ బాలికపై లైంగిక దాడి, హత్యాయత్నం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ప్రజా సంఘా ల ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితుడు మహ్మద్ గౌస్‌కు ఉరి శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బస్‌స్టాండ్ సెంటర్ నుంచి గౌతమ్ నగర్ కాలనీ గేటు వరకు ర్యాలీ చేపట్టారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా విచారణ చేపట్టాలని కోరారు.