హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రైతులకు మేలుచేసే విధంగా కార్పొరేషన్ల పనితీరు మెరుగుపడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ కార్పొరేషన్ల పురోగతికి మంగళవారం సచివాలయంలో చైర్మన్లు, ఎండీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఎరువుల సరఫరా మానిటరింగ్ మరింత సమర్థవంతంగా చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలోని గోదాములను ఓకే గొడుకు కిందకు తీసుకోవాలని సూచించారు.