చేర్యాల : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సోవాలు, మహా శివరాత్రిని పురస్కరించుకుని పంచరంగులతో తయారు చేసిన పెద్దపట్నం వద్ద పాటలు పాడుతూ ఒగ్గుపూజారులు సందడి చేశారు.
లింగోద్భవ కాలం రాత్రి 12గంటలకు మల్లికార్జున స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను రాజగోపురం, రాతిగీరలు తదితర ప్రాంతాల్లో ఊరేగించి, పెద్దపట్నం దాటించారు. భక్తులు పెద్దపట్నం దాటి స్వామి వారిని దర్శించుకున్నారు.