కొండపాక(కుకునూరుపల్లి), జనవరి 9 : కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు నిర్బంధంలో కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండపాక గురుకుల పాఠశాల పీడీ వాసు విద్యార్థులకు ఆటలు, క్రమశిక్షణ నేర్పించాల్సింది పోయి స్టడీ అవర్స్‌కు అలస్యంగా వచ్చారని వాత లు వచ్చేలా చితకబాదడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ స్పందించి పీడీ వాసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్‌చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఫుడ్ పాయిజన్, పాముకాట్లు, ఇతర ఇష్యూలు జరుగుతున్నాయని ఆరోపించారు. గురుకుల సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.