హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇస్తుం టే.. రైతులు తమకు కావాల్సినప్పుడే మోటర్లు పెట్టి నీళ్లు వాడుకొంటుంటే తట్టుకోలేని ప్రతిపక్ష నాయకులు పిచ్చికూతలు కూస్తున్నారని పోలీస్ హౌ సింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దా మోదర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవసాయరంగం ప్రగతి పథాన దూసుకుపోతుంటే ఓర్వలేనితనంతో ఆరోపణలు చేస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. విపక్షాలు తలకిందులుగా తపస్సు చేసి నా అధికారం అందని ద్రాక్షేనని వ్యాఖ్యానించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించడం ఖాయమని పునరుద్ఘాటించారు.