హైదరాబాద్, నవంబర్ 8(నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిం ది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నదని, దీంతో దక్షిణాదిన పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవా రం హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో 3 గంటలపాటు వర్షం దంచికొట్టింది. అత్యధికంగా భద్రాద్రి జిల్లా మద్దుకూరులో 10 సెం.మీ., యాదాద్రిలోని నారాయణపూర్‌లో 7.6 సెం.మీ, శేరిలింగంపల్ల్లిలో 4 సెం.మీ. నమోదైంది. వచ్చే మూడు రోజులు హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలతోపాటు వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది.