హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడం కంటే పోస్టుల సంఖ్య పెంచడమే ముఖ్యమని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 2లో రెండు వేలు, గ్రూప్ 3లో మూడు వేల పోస్టుల సంఖ్యను పెంచాలని నిరుద్యోగులు ఉద్యమాలు చేపడితే, కేవలం గ్రూప్ 2ను వాయిదా వేసి తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు. పోస్టుల పెంపు కోసం ప్రభుత్వంపై బీఆర్ఎస్వీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. గ్రూప్ 2, 3 పరీక్షలను ఒకేసారి నిర్వహించాలని డిమాండ్ చేశారు.