కాస్త కఠినం.. సమయం సరిపోలే
నీట్ పరీక్ష ఆదివారం సజావుగా ముగిసింది. రాష్ట్రంలో సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. నిరుడు మాదిరిగానే ఈసారి కూడా నీట్ పరీక్ష కాస్త కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు చెప్పారు.
- నీట్ రాసిన విద్యార్థుల వెల్లడి
- సజావుగా ముగిసిన పరీక్ష
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): నీట్ పరీక్ష ఆదివారం సజావుగా ముగిసింది. రాష్ట్రంలో సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. నిరుడు మాదిరిగానే ఈసారి కూడా నీట్ పరీక్ష కాస్త కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు చెప్పారు. విశ్లేషణాత్మక ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయని, ఫలితంగా సమయం సరిపోలేదని వాపోయారు. ఈ ఏడాది వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం రెండింటిలోనూ ‘స్టేట్మెంట్’ తరహా ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. ఒక ప్రశ్నకు జవాబులుగా నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి, వాటిల్లో ఏది సరైందో గుర్తుపట్టాలని సూచించారు. దీంతో నాలుగు స్టేట్మెంట్లు చదవడానికే ఎక్కువ సమయం పట్టిందని విద్యార్థులు తెలిపారు. ఫిజిక్స్ పర్వాలేదని, రసాయన శాస్త్రంలో ప్రశ్నలు కాస్త కఠినంగా వచ్చాయని తెలిపారు.
కటాఫ్ మార్కులు తగ్గొచ్చు..
గత నాలుగేండ్ల నీట్ తీరును గమనిస్తే.. 2020లో పేపర్ చాలా సులభంగా వచ్చిందని, 2021లో పేపర్ పర్వాలేదని, గత ఏడాది కాస్త కఠినంగా ఉన్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో గత మూడేండ్లలో వరుసగా ఓపెన్ కటాఫ్ 147, 138, 117 గా నమోదై, ప్రతిసారి కాస్త తగ్గినట్టు వెల్లడించారు. ఈ ఏడాది పేపర్ పెద్దగా కఠినంగా లేకపోయినా.. సమయం ఎక్కువగా తీసుకోవడంతో కటాఫ్ మరింత తగ్గే అవకాశం ఉన్నదని నీట్ శిక్షకుడు శంకర్ రావు విశ్లేషించారు. నిరుడు కన్వీనర్ కోటాలో తెలంగాణలో 450 మార్కులకు కటాఫ్ వచ్చిందని, ఈసారి 435-430 మధ్యకు తగ్గవచ్చని అంచనా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

