హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఉన్న దవాఖానలు, మెడికల్ కాలేజీల్లో పేషెంట్లకు వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్‌ను మానిటరింగ్ చేసేందుకు డ్రగ్స్ అండ్ థెరప్యూటిక్స్ కమిటీలను(డీటీసీ) ఏర్పాటు చేయాలని అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలను జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) ఆదేశించింది. డాక్టర్లు రోగులకు రాసే ప్రిస్క్రిప్షన్‌ను క్యాపిటల్ లెటర్స్‌లో స్పష్టంగా రాయాలని ఎన్ఎంసీ గైడ్‌లైన్స్ ఉండగా..
కొంతమంది ఇష్టారాజ్యంగా రాయడంతో ఫార్మాసిస్టులకు అర్థం కావడం లేదని పేర్కొన్నది. ఫార్మాసిస్టులతోపాటు పేషెంట్లకు అర్థం అయ్యేలా క్లియర్‌గా ప్రిస్క్రిప్షన్ రాయాలని తాజా ఉత్తర్వుల్లో ఆదేశించింది.