హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్)-2023 ప్రకారం విద్యాశాఖ కొత్త పాఠ్యపుస్తకాలను దశలవారీగా రూపొందించనున్నది. 2014 తర్వాత కేసీఆర్ సర్కారు హయాంలో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేశారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్)-2023 ఆధారంగానే కొత్త కరిక్యులం రూపొందించాల్సి ఉంది.
ప్రస్తుతం తెలుగు, హిందీ, ఉర్దూ వంటి భాషలను మినహాయించి నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు కొత్త కరిక్యులాన్ని రూపొందించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత భాషలకు సంబంధించిన కరిక్యులాన్ని సైతం మార్చనున్నారు.