దారుణం : పురిట్లోనే శిశువు..కాసేపటికే తల్లి మృతి..తట్టుకోలేక నానమ్మ..
Crime news | పురిట్లోనే శిశువు.. కాసేపటికే తల్లి మృతి చెందగా..ఇది తట్టుకోలేక బాలింత నానమ్మ మృతి చెందిన హృదయ విదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గురువారం చోటు చేసుకుంది.

నవమాసాలు కడుపులో బిడ్డను మోసిన ఆ తల్లి పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నది. ఆమే కాదు.. ఆమె కుటుంబం కూడా ఎంతో సంబురపడిపోయింది. తొందరలోనే తమ ఇంటికి వారసుడు రాబోతున్నాడని ఆనందపడుతున్న సమయంలో వారిపై దేవుడు చిన్నచూపు చూశాడు. పురిట్లోనే శిశువు కన్నుమూసింది. పుట్టిన బిడ్డ చనిపోయిందన్న విషయం కూడా తెలియకముందే ఆ తల్లి కూడా ఆనారోగ్యంతో మరణించింది. మునిమనమరాలిని ఎత్తుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నబామ్మకు.. కళ్లముందు మనమరాలి మృతదేహం కనబడటంతో కుంగిపోయింది. ఆ బాధ తట్టుకోలేక బామ్మ గుండె ఆగింది. ఇలా ఒకే రోజు ఆ కుటుంబంలో ముగ్గురు మృతిచెందడం అందర్నీ కలిచివేసింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కోడిపుంజుల తండాకు చెందిన ధరంసోత్ మోహన్ భార్య రేణుక 9 నెలల గర్భిణి. నాలుగు రోజుల క్రితం నొప్పులు రావడంతో ఆమెను మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె జ్వరంతో బాధపడుతుంది. ఈ క్రమంలో గురువారం పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పురిట్లోనే శిశువు మృతిచెందింది. కాసేపటికే అనారోగ్యంతో రేణుక కూడా మరణించింది. ఇంటికి మహాలక్ష్మి వస్తుందని ఆశపడిన ఆ కుటుంబం.. తల్లీబిడ్డల మరణవార్త తెలియడంతో విషాదంలో మునిగిపోయింది. ఆ బాధలోనే మృతదేహాలను రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. కానీ మునిమనమరాలిని చూద్దామని ఎదురుచూస్తున్న ఆ బామ్మ జోడ జాంకీ ( 80).. మనమరాలి మృతిని తట్టుకోలేకపోయింది. గుండెలవిసేలా ఏడ్చింది. ఈ క్రమంలో గుండెపోటుతో మరణించింది. దీంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

