హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తుండగా, మరోవైపు అకడకడ చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని.. అలాగే కొన్ని ప్రాంతాల్లో ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేరొంది.