హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో లోపాలు గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ 10 కమిటీలు నియమించింది. ఇటీవల జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) రాష్ట్రంలో 26 మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేవని నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
ఈ కమిటీలు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అందుతున్న వైద్య సేవలు సహా పలు అంశాలను పరిశీలించనున్నాయి. అనంతరం నివేదికను రూపొందించి ఎన్ఎంసీకి అందిచనున్నాయి.