హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): మరణించిన వర్కింగ్ జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించాలని మీడియా అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కౌన్సిల్ సమావేశం గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో జరిగింది. అకాడమీ ఛైర్మన్ కే శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వర్కింగ్ జర్నలిస్ట్‌లకు శిక్షణా తరగతులు, మరణించిన జర్నలిస్ట్‌ల కుటుంబాలకు ఆర్థికసాయం, ప్రతిష్ఠాత్మకమైన ‘న్యూస్ పేపర్స్ ఆైర్కెవ్స్’ను కొనసాగించాలని నిర్ణయించారు.
ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి కే ధర్మయ్య, ఐ అండ్ పీఆర్ శాఖ జాయింట్ డైరెక్టర్ డీఎస్ జగన్, డాక్టర్ సతీష్ కుమార్ తల్లాడి, డాక్టర్ యాదగిరి కంభంపాటి, దూరదర్శన్ కేంద్రం ప్రోగ్రాం ఇన్చార్జి పీవీ సత్యనారాయణ, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్స్ హెడ్ రమేశ్ సుంకసారి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.