హిమాయత్‌నగర్, జూన్ 29: మాల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ డిమాండ్ చేశారు. సోమవా రం హైదర్‌గూడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 30లక్షలకుపైగా జనాభా కలిగిన మాలల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సర్ పేరిట మాలల ఓట్లు తగ్గించేందుకు కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు.